`న‌గ్నం` హీరోయిన్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?


`న‌గ్నం` హీరోయిన్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?
`న‌గ్నం` హీరోయిన్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

క‌రోనా దెబ్బ‌తో యావ‌త్ సినీ జ‌నం విల విల‌లాడుతుంటే వ‌ర్మ మాత్రం కొత్త త‌ర‌హా మేకింగ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని సొంత ఓటీటీలో రిలీజ్ చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. అత్యంత త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తూ భారీ స్థాయిలో లాభాల్ని ద‌క్కించుకుంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తున్నారు. పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో `క్లైమాక్స్‌` పేరుతో బీ గ్రేడ్ చిత్రాన్ని రూపొందించి రిలీజ్ చేసిన వ‌ర్మ తాజాగా `న‌గ్నం` పేరుతో మ‌రో బూతు చిత్రాన్ని వ‌దిలిన విష‌యం తెలిసిందే.

ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ పేరుతో కొత్త యాప్‌ని క్రియేట్ చేసిన వ‌ర్మ ఈ యాప్‌లో వ‌రుసగా సినిమాల్ని రిల‌జ్ చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. `న‌గ్నం` పేరుతో రిలీజ్ చేసిన చిత్రానికి ప‌ర్ వ్యూ కి 200 ఫిక్స్ చేసిన వ‌ర్మ ల‌క్ష బ‌డ్జెట్‌తో 70 ల‌క్ష‌లు లాభం పొందాన‌ని చెప్పడం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. అయితే అస‌లు వాస్తం మ‌రోలా వుంది. యువ‌త‌ని టార్గెట్ చేస్తూ నిర్మించిన `న‌గ్నం` చిత్రంతో వెస్ట్ గోదావ‌రి జిల్లా దేవ‌ర ప‌ల్లికి చెందిన స్వీటీ అలియాస్ శ్రీ రాపాక ప‌రిచ‌య‌మైంది.

ఇందులో యువ‌త‌ను రెచ్చ‌గొట్టే విధంగా న‌టించినందుకు ఆమెకు వ‌ర్మ ఇచ్చిన పారితోషికం అక్ష‌రాలా రెండు ల‌క్ష‌లు అని స్వ‌యంగా స్వీటీనే వెల్ల‌డించింది. దీంతో వ‌ర్మ చెప్పింది వ‌ట్టి ప‌బ్లిసిటీ స్టంట్ అని తేలింది. యూఎస్‌లో మాస్ట‌ర్స్ చేసిన స్వీటీ సినిమాల్లో న‌టించ‌డం ఇదే తొలిసారి అయినా ఆమెకు బుల్లితెర ప‌రిచ‌య‌మే. రంగ్థ‌లం, ప్రో క‌బ‌డ్డీల్లో పాల్గొంద‌ట‌. ఫ్యాష‌న్ డిజైన‌ర్ అయిన స్వీటీ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా కూడా ప‌నిచేసింద‌ని తెలిసింది. వెండితెర‌పై అందాలు ఆర‌బోయ‌డం త‌న‌కు ఇష్ట‌మేని, ఇక‌పై కూడా అలాంటి పాత్ర‌ల్లో న‌టించ‌డానికి తాను సిద్ధ‌మేన‌ని చెబుతోంది.