న‌న్ను కొడితే తిరిగి కొట్టేస్తాన‌ని చెప్పా – స్వీటీ

న‌న్ను కొడితే తిరిగి కొట్టేస్తాన‌ని చెప్పా - స్వీటీ
న‌న్ను కొడితే తిరిగి కొట్టేస్తాన‌ని చెప్పా – స్వీటీ

సంచ‌ల‌న చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సొంతం గా ఓటీటీని లాంఛ్ చేసి వ‌రుస చిత్రాల్ని అందిస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. క్లైమాక్స్ త‌రువాత వ‌ర్మ రూపొందించిన చిత్రం `నేక్డ్‌` (న‌గ్నం). ప‌క్కా అడ‌ల్ట్ కంటెంట్‌తో యువ‌త‌ని టార్గెట్ చేస్తూ వ‌ర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం ద్వారా ఈస్ట్ గోదావిరి చెందిన స్వీటీ అలియాస్ శ్రీ‌రాపాక హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది.

సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా వ‌రుస‌గా టీవీ ఛాన‌ల్స్‌తో పాటు యూట్యూబ్ ఛాన‌ల్స్‌కి ఇంట‌ర్వ్యూలు ఇచ్చేస్తోంది. ప‌నిలో ప‌నిగా త‌నెవ‌రో ఎక్క‌డి నుంచి ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించిందో వివ‌రిస్తోంది. అంతేనా త‌న‌ని అడ‌గ‌ని విష‌యాల‌ని కూడా చెప్పేస్తోంది. ఈ సంద‌ర్భంగా హీరో నంద‌మూరి బాల‌కృష్ణ గురించి స్వీటీ చెప్పిన విష‌యాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

స్వీటి మాట్లాడుతూ `మ‌హిళా ఆర్టిస్ట్‌ల‌ని బాల‌కృ‌ష్ణ రావే పోవే అని పిలుస్తుంటార‌ట. ఆ విష‌యం నాకు తెలిసింది.  కానీ నేను టెక్నీషియ‌న్ కావ‌డంతో న‌న్ను బాల‌కృష్ణ అలా పిల‌వ‌లేదు. బాల‌కృష్ణ‌గారి ఇంటికి ఓ సినిమా విష‌యంలో బ‌ల‌వంతంగా వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో బాల‌కృష్ణ‌గారిని `స‌ర్ మీరు కాస్ట్యూమ్ డిజైన‌ర్స్‌ని కొడ‌తార‌ట క‌దా? నిజ‌మేనా?  మీరు జూన్ 10న పుట్టారు, నేను జూన్ 13న పుట్టాను సేమ్ మెంటాలిటీ అని చెప్పాను. ఆయ‌న న‌న్ను కొడితే ఇండైరెక్ట్‌గా మిమ్మ‌ల్ని కొట్టేస్తాన‌ని చెప్పాన‌ని స్వీటీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.