బాడ్మింటన్ లో గెలిచింది – కింగ్ దగ్గర కార్ కొట్టేసింది!


Nagrajuna gifts key of BMW car to PV Sindhu
Nagrajuna gifts key of BMW car to PV Sindhu

బాడ్మింటన్ అనగానే మనకి గుర్తొచ్చే పేరు “సైనా నెహ్వాల్” అది ఒకప్పటి మాట, కానీ “పి.వి. సింధు” ఇప్పుడు మాట, ఎందుకంటె ప్రపంచ ఛాంపియన్ షిప్ లో
గోల్డ్ మెడల్ “పి.వి. సింధు” మాత్రమే ఇండియా తరపున ఈ ఘనతను సాధించింది. వీళ్ళ ఇద్దరి ట్రైనర్ కూడా ఒక్కరే అవ్వడం అది మన తెలుగు వారైన “పుల్లెల గోపిచంద్” అనడం లో తెలుగు వారి ఖ్యాతి బాగా అభివృద్ధి చెందుతుంది.

మొన్న జరిగిన ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భాగంగా సింధు మన ఇండియా కి గోల్డ్ మెడల్ పథకం సాధించడం, మన సెలెబ్రెటీస్ దగ్గర నుండి, రాజకీయ నాయకులు మరియు “ప్రధాని మోడీ” వంటి వారు కూడా ఆమెని ప్రశంసించడం చూసాం. ఇక సింధుకి బహుమతులు కూడా పెద్ద పెద్ద వారి దగ్గరనుండి తనకి రావడం మనం చూసాం.

కానీ ఈ రోజు ఏకంగా మన టాలీవుడ్ కింగ్ మన్మధుడు “అక్కినేని నాగార్జున ” గారు సింధుకి “వి. చాముండేశ్వరనాధ్” తరపున “బిఎండబ్ల్యూ ఎక్స్5” మోడల్ కార్ ని బహుకరించారు, దాని విలువ అక్షరాలా 72,90,000/- రూపాయలు ఉంటుందని అంచన, నిజంగా సింధు చాలా లక్కీ గర్ల్ అని పలు మీడియా సంఘాలు ఆమెని ప్రసంశించక తప్పట్లేదు.

ఇంకా ఇలాంటి బహుమానాలు ఎన్నో తనకి రావాలి, మన ఇండియా కి కుడా తన ద్వారా ఇంకా ఇంకా ఎన్నో బంగారు పతకాలు రావాలి అని భగవంతుణ్ణి కోరుకుందాం.