నాగ్ `బంగార్రాజు` మొద‌ల‌య్యేది అప్పుడే!


Nags Bangarraju to bigin march 25th 2
Nags Bangarraju to bigin march 25th 2

భారీ అంచ‌నాలు పెట్టుకున్న `మ‌న్న‌థుడు 2` నాగ్‌ని చాలా డిస్స‌ప్పాయింట్ చేసింది. దీంతో కొంత నిరుత్సాహానికి గురైన ఆయ‌న మ‌ళ్లీ వ‌రుస చిత్రాల్లో న‌టించ‌డం మొద‌లుపెట్టారు. హిందీలో `బ్ర‌హ్మాస్త్ర‌`ని పూర్తి చేసిన ఆయ‌న తెలుగులో సైలెంట్‌గా `వైల్డ్ డాగ్‌` చిత్రాన్ని స్టార్ట్ చేసి ఫ‌స్ట్ లుక్‌తో షాకిచ్చారు. ఇదిలా వుంటే త‌నని 50 కోట్ల క్ల‌బ్‌లో చేర్చిన బంగార్రాజుని లైన్‌లో పెడుతున్నార‌ని తెలిసింది. 2016లో నాగార్జున న‌టించి `సోగ్గాడే చిన్ని నాయ‌నా` మంచి విజ‌యాన్ని సాధించిన విష‌యం తెలిసిందే.

బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నాగ్ చిత్రాల్లోనే స‌రికొత్త రికార్డులు సృష్టించింది, దీనికి సీక్వెల్‌ని చేయాల‌ని చాలా రోజులుగా నాగార్జున అనుకుంటున్నారు. కానీ క‌థ అనుకున్న విథంగా రాక‌పోవ‌డంతో వాయిదా వేస్తూ వ‌స్తున్నారు. తాజాగా క‌థ‌లో మార్పులు చేర్పులు పూర్తి కావ‌డం. ఫైన‌ల్‌స్టోరీ లాక్ చేయ‌డంతో సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిద్దామా అని ప్లాన్‌లు మొద‌లుపెట్టార‌ట‌.

నాగ‌చైత‌న్య కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న ఈ చిత్రాన్ని మార్చి 25న లాంఛ‌నంగా ప్రారంభించాల‌ని డేట్ కూడా ఫిక్స్ చేసిన‌ట్టు తెలిసింది. `సోగ్గాడే చిన్నినాయ‌నా` చిత్రాన్ని రూపొందించిన క‌ల్యాణ్‌కృష్ణ‌నే ఈ చిత్రాన్ని కూడా రూపొందించ‌బోతున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై హీరో నాగార్జున స్వ‌యంగా నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.