వ‌ర్మ‌కు షాకిచ్చిన న‌ల్ల‌గొండ కోర్టు‌!


వ‌ర్మ‌కు షాకిచ్చిన న‌ల్ల‌గొండ కోర్టు‌!
వ‌ర్మ‌కు షాకిచ్చిన న‌ల్ల‌గొండ కోర్టు‌!

వ‌రుస వివాదాస్ప‌ద చిత్రాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. `ప‌వ‌ర్‌స్టార్` అంటూ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని కించ‌ప‌రిచిన వ‌ర్మ తాజాగా మిర్యాల గూడ ప‌రువు హ‌త్య నేప‌థ్యంలో `మ‌ర్డ‌ర్‌` చిత్రాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం న‌ల్ల‌గొండ లోని సూర్య పేట‌లో ప్ర‌ణ‌య్ దారుణ హ‌త్యోదంతం నేప‌థ్యంలో వ‌ర్మ `మ‌ర్డ‌ర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో త‌మ‌ని త‌ప్పుగా చూపిస్తున్నారంటా న‌ల్ల‌గొండ కోర్టుని ప్ర‌ణ‌య్ భార్య అమృత ఆశ్ర‌యించింది.

త‌మ అనుమ‌తి లేకుండా త‌మ ఫొటోలు, పేర్లు వాడుకుంటూ త‌మ‌ని కించ‌ప‌రుస్తున్నాడ‌ని అమృత న‌ల్ల‌గొండ‌లోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న‌ల్ల‌గొండ కోర్టు విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌రాదంటూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో త‌న‌కు అడ్డులేద‌ని చెప్పుకున్న వ‌ర్మ‌కు గ‌ట్టి షాకిచ్చిన‌ట్టయింది.

ఇటీవ‌ల ఈ చిత్రంపై ట్రైల‌ర్‌ని వ‌ర్మ వ‌దిలిన విష‌యం తెలిసిందే. రిలీజ్ కోసం అప్పుడే ప్ర‌చారం మొద‌లుపెట్టిన వ‌ర్మ తాజా కోర్టు ఉత్త‌ర్వుల‌పై ఎలా స్పందిస్తారో చూడాలి అంటున్నారు టాలీవుడ్ జ‌నం. పంపితే త‌ప్పేంటి అనే కోణంలో ప్ర‌ణ‌య్, అమృత‌ల ప్రేమ‌ని త‌ప్పుగా ప్ర‌జెంట్ చేస్తూ వ‌ర్మ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.