హాట్ హీరోయిన్ ఓటీటీ థియేట‌ర్!

హాట్ హీరోయిన్ ఓటీటీ థియేట‌ర్!
హాట్ హీరోయిన్ ఓటీటీ థియేట‌ర్!

క‌రోనా కార‌ణంగా దేశ వ్యాప్తంగా ఓటీటీల‌కు మంచి ఆద‌ర‌ణ మొద‌లైంది. దీంతో చాలా మంది ఓటీటీల బాట ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ద‌క్షిణాదిలో ప‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు మొద‌ల‌య్యాయి. తెలుగులో తొలిసారిగా `ఆహా` ఓటీటీ మొద‌లైన విష‌యం తెలిసిందే. ద‌క్షిణాదిలో అతి పెద్ద ఓటీటీగా పేరు తెచ్చుకుంటోంది కూడా. వ‌ర్మ‌ కూడా ఆర్జీవీ వ‌ల‌ల్డ్ థీయేట‌ర్ పేరుతో ఓటీటీని ప్రారంభించిన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న న‌మిత త‌న పేరుతో `న‌మిత థియేట‌ర్‌` పేరుతో సొంతంగా ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. `సొంతం` సినిమాతో నమిత తెలుగు ప్రేక్షకులకు పరిచయ‌మై న‌టిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత త‌మిళంలోకి ప్ర‌వేశించి అక్క‌డా గుర్తింపుని తెచ్చుకుంది.

తాజాగా ఆమె తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను `నమిత థియేటర్` పేరుతో ప్రారంభించి డిజిట‌ల్ రంగంలోకి ప్ర‌వేశిస్తుండ‌టం విశేషం. దీని గురించి న‌మిత బుధ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రవివర్మ సహకారంతో నమిత ఈ కొత్త OTT ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తోంది. నటి తన OTT ప్లాట్‌ఫామ్ ద్వారా నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిన చిన్న కథలు, సినిమాలను ప్రదర్శించాలనుకుంటోంది.