న‌మ్ర‌త ఆల్ టైమ్ ఫేవ‌రేట్ ఫిల్మ్ ఇదే!


న‌మ్ర‌త ఆల్ టైమ్ ఫేవ‌రేట్ ఫిల్మ్ ఇదే!
న‌మ్ర‌త ఆల్ టైమ్ ఫేవ‌రేట్ ఫిల్మ్ ఇదే!

సోష‌ల్ మీడియాలో మ‌హేష్ వైఫ్ చాలా యాక్టీవ్‌గా వుంటున్నారు. మ‌హేష్ గురించి ఏ చిన్న అప్‌డేట్ వ‌చ్చిన వెంట‌నే షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి వార్త‌నే న‌మ్ర‌త సోమ‌వారం సోష‌ల్ మీడియా ఇన్‌స్టా వేదిక‌గా షేర్ చేశారు. మ‌హేష్ న‌టించిన `మురారి` చిత్రం పోస్ట‌ర్‌ని ఈ సంద‌ర్భంగా న‌మ్ర‌త షేర్ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మ‌హేష్ 2001లో న‌టించిన చిత్రం `మురారి`.

క్రియేటీవ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన ఈ చిత్రం విడుద‌లై దాదాపు 19 ఏళ్ల‌వుతోంది. దేవుడు, న‌మ్మ‌కం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు కృష్ఱ‌వంశీ రూపొందించారు. ఇందులో మ‌హేష్‌కు జోడీగా బాలీవుడ్ భామ సొనాలీ బెంద్రే న‌టించింది. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, క్లైమాక్స్‌లో బుల్ల‌బ్బాయ్ అంటూ అరుస్తూ మ‌హేష్ ప‌లికించిన హావ భావాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్లుగా నిలిచాయి. ఇక మ‌ణిశర్మ సంగీతం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఎక్క‌డ ఎక్క‌డ వుందో తార‌క‌…, డుం డుం డుం న‌ట‌రాజు, బంగారు క‌ళ్ల బుచ్చ‌మ్మో.. అల‌నాటి రామ‌చంద్రుడిక‌న్నింట సాటి.. వంటి పాట‌లు ఇప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీనే. 2001 ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌లైన ఈ చిత్రం ఈ రోజుతో 19 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డంతో మ‌హేష్ వైఫ్ న‌మ్ర‌త `మురారి` పోస్ట‌ర్‌ని షేర్ చేస్తూ ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని పెట్టింది. మ‌హేష్ సినిమాల్లో నాకు న‌చ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ ఇది. ఇందులో మ‌హేష్ ప్ర‌ద‌ర్శించిన న‌ట‌న నాకు అల్‌టైమ్ ఫేవ‌రేట్‌. ఈ సంద‌ర్భంగా ఎంటైర్ టీమ్‌కి చీర్స్‌` అని ఓ పోస్ట్ ని షేర్ చేయడం ఆక‌ట్టుకుంటోంది.

Credit: Instagram