మ‌హేష్ డెన్ ఎలా వుందో చూశారా?


మ‌హేష్ డెన్ ఎలా వుందో చూశారా?
మ‌హేష్ డెన్ ఎలా వుందో చూశారా?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికించ‌డం మొద‌లైన ద‌గ్గ‌రి నుంచి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్నారు. ప్ర‌తీ విష‌యంపై స్పందిస్తున్నారు. త‌న‌కు సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవ‌ల బ‌య‌టికి వ‌చ్చే ప్ర‌తీ వారు మాస్కులు ధ‌రించాల‌ని, మాస్కులు ధ‌రించ‌కుండా బ‌య‌టికి రావొద్దంటూ త‌ను మాస్కును ధ‌రించి ఆ ఫొటోని సోష‌ల్ మ‌డియాలో షేర్ చేశారు.

ఇదిలా వుంటే మ‌హేష్‌తో స‌మానంగా ఆయ‌న స‌తీమ‌ణి న‌మ్ర‌త కూడా సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటోంది. మ‌మేష్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోల‌తో పాటు పిల్ల‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ని కూడా షేర్ చేస్తూ అభిమానుల‌తో పంచుకుంటోంది. తాజాగా మ‌హేష్‌కు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

మ‌హేష్ ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌తీ రోజు క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తూ ఫిట్‌గా క‌నిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే త‌న ఏజ్‌ని చాలా వ‌ర‌కు త‌గ్గించుకున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు కూడా. అయితే మ‌హేష్ వ్యాయం చేస్తున్న వీడియోల‌ని పోస్ట్ చేసిన న‌మ్ర‌త ఆ వీడియోల‌తో పాటు ఆస‌క్తిక‌రమైన ఓ పోస్ట్‌ని పెట్టింది. మ‌హేష్ థ్రెడ్ మిల్‌పై ర‌న్నింగ్ చేస్తున్న వీడియోతో పాటు జిమ్‌లోకి ఎంట‌ర‌వుతున్న వీడియోని షేర్ చేసిన న‌మ్ర‌త ఇది త‌న ల‌య‌న్ డెన్ అని అభివ‌ర్ణించ‌డం విశేషం.

 

View this post on Instagram

 

The Lion’s den !! #stayhomestaysafe

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

Credit: Instagram