మహేష్ బాబు రాజకీయాల్లోకి రాడట

Namrata comments on mahesh political entry మహేష్ బాబు కుటుంబంలో రాజకీయాలకు సంబందించిన నాయకులు ఉన్నారు . తండ్రి కృష్ణ మొదటి నుండి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరించడమే కాకుండా పార్లమెంట్ కు కూడా ప్రాతినిధ్యం వహించాడు . ఇక ఇప్పుడేమో మహేష్ పెద్ద బావ గల్లా జయదేవ్ కూడా తెలుగుదేశం పార్టీ తరుపున గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు . అలాగే మహేష్ చిన్నాన్న కూడా రాజకీయాల్లోనే ఉన్నాడు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరాడు . దాంతో మహేష్ బాబు గురించి చర్చ మొదలయ్యింది .

 

అయితే మహేష్ బాబు రాజకీయాల్లోకి వచ్చేది లేదని తేల్చిచెప్పింది మహేష్ భార్య నమ్రత . మహేష్ కు సినిమాల గురించి ఆలోచనలు తప్ప రాజకీయాల గురించి ఆలోచించేంత సమయం లేదని , అలాగే ఆసక్తి కూడా లేదని భవిష్యత్ లో కూడా రాజకీయాలలోకి వచ్చే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది నమ్రత .

 

English Title: Namrata comments on mahesh political entry