మ‌హేష్ – పూరిజ‌గ‌న్నాథ్ సినిమాపై న‌మ్ర‌త కామెంట్‌!


మ‌హేష్ - పూరిజ‌గ‌న్నాథ్ సినిమాపై న‌మ్ర‌త కామెంట్‌!
మ‌హేష్ – పూరిజ‌గ‌న్నాథ్ సినిమాపై న‌మ్ర‌త కామెంట్‌!

మ‌హేష్ కెరీర్‌ని మ‌లుపు తిప్పిన చిత్రం `ఒక్క‌డు`. ఈ సినిమా త‌రువాత మ‌హేష్‌ని స్టార్‌ని చేసిన సినిమా మాత్రం `పోకిరి`నే. పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డుల్ని తిర‌గ‌రాసి హీరోగా మ‌హేష్ స‌త్తా ఏంటో బాక్సీఫీస్ వ‌ద్ద నిరూపించింది. పూరీని కూడా స్టార్ డైరెక్ట‌ర్‌ల జాబితాలో చేర్చింది. ఆ త‌రువాత కొన్నేళ్ల‌కు మ‌హ‌ష్ – పూరీ క‌లిసి `బిజినెస్‌మెన్‌` చేశారు. అయితే ఆ స్థాయిలో మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయారు.

బాక్సాఫీస్ వ‌ద్ద `బిజినెస్‌మెన్‌` మంచి విజయాన్నే సాధించినా `పోకిరి` మాత్రం మ‌రిపించ‌లేక‌పోయింది. దీంతో మ‌ళ్లీ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఆ స్థాయి సినిమా ఎప్పుడ‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు గ‌త కొన్నేళ్లుగా ఎదురుచూస్తూనే వున్నారు. `జ‌న‌ గ‌ణ మ‌న‌` వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ప‌ట్టాలెక్కుతుంద‌ని అంతా భావించారు. ఎందుకో అది జ‌ర‌గ‌లేదు. పూరీ ఎంత ప్ర‌య‌త్నించినా మ‌హేష్ అత‌నికి డేట్స్ ఇవ్వ‌లేదు. ఇలా ఏళ్లు గ‌డిచిపోయాయి.

తాజాగా ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ పూర్వ వాతావ‌ర‌ణం మొద‌లైంది. పూరీతో సినిమా ఎప్పుడంటే ఆయ‌న పిలుపు కోస‌మే ఎదురుచూస్తున్నాన‌ని ఆ మ‌ధ్య మ‌హేష్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్‌తో జ‌రిగిన చిట్ చాట్‌లో వెల్ల‌డించారు. పూరీ కూడా `స‌ర్కారు వారి పాట‌` ఫ‌స్ట్ లుక్ అదిరింద‌ని, సినిమా కూడా సూప‌ర్ హిట్ కావాల‌ని సోష‌ల్ మీడియా వేద‌క‌గా వెల్ల‌డించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడ‌ని తాజాగా న‌మ్ర‌‌త‌ని ఇన్ స్టా వేదిక‌గా ప్ర‌శ్నిస్తే మాత్రం ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పింది. అది కాల‌మే నిర్ణ‌యించాల‌ని న‌మ్ర‌‌త స‌మాధానం చెప్ప‌డం విస్మ‌యాన్ని క‌లిగించింది. అంటే `జ‌న గ‌ణ మ‌న` మ‌హేష్‌తో వుండే అవ‌కాశం లేద‌ని న‌మ్ర‌త ఇండైరెక్ట్‌గా స్ప‌ష్టం చేసింద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు అంటున్నారు.