మ‌హేష్ కోసం ఆమెని రెక‌మెండ్ చేస్తున్నారా?


మ‌హేష్ కోసం ఆమెని రెక‌మెండ్ చేస్తున్నారా?
మ‌హేష్ కోసం ఆమెని రెక‌మెండ్ చేస్తున్నారా?

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ తాజాగా `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్‌కా బాప్ విజ‌యాన్ని సాధించి కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. 200 కోట్ల మైలు రాయిని దాటి వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో రెట్టించిన ఉత్సాహంలో వున్న మ‌హేష్ ప్ర‌స్తుతం ఫ్యామిలీతో క‌లిసి అమెరికాలో విహార హాత్ర చేస్తున్నారు. ఏప్రిల్ వ‌ర‌కు రెస్ట్ మోడ్‌లో వుండ‌నున్న మ‌హేష్ ఆ త‌రువాత త‌న 27వ చిత్రాన్ని మొద‌లుపెట్ట‌నున్న విష‌యం తెలిసిందే.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమాలో మ‌హేష్ జేమ్స్ బాండ్ త‌ర‌హా స్పైగా క‌నిపించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో వున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ సినిమా లావిష్‌గా పాన్ ఇండియా స్థాయిలో వుండ‌నుంద‌ట‌. దీని కోసం ఇప్ప‌టికే భారీ స్కెచ్‌ని రెడీ చేసిన వంశీ పైడిప‌ల్లి అమెరికా నుంచి మ‌హేష్ తిరిగొచ్చాక ఫైన‌ల్ స్క్రిప్ట్‌ని నెరేట్ చేస్తాడ‌ట‌.

ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి రానున్న ఈ సినిమా కోసం కొంత మంది హీరోయిన్‌ల‌ని ప‌రిశీలించిన వంశీ పైడిప‌ల్లికి కియారాను న‌మ్ర‌త రిక‌మండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. వంశీ కూడా ఆమెనే ఫైన‌ల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నార‌ట‌. కియారా అద్వానీ ఇటీవ‌ల మ‌హేష్‌తో క‌లిసి `భ‌ర‌త్ అనే నేను` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే.