మహేష్ భార్య నమ్రతని విమర్శించిన నెటిజన్


మహర్షి సక్సెస్ తో ఆనందంగా ఉన్నారు మహేష్ బాబు అలాగే ఆ చిత్ర బృందం . ఇక మహేష్ బాబు భార్య నమ్రత సంతోషానికి అవధులే లేకుండాపోయాయి . దాంతో మహర్షి విజయాన్ని సెలబ్రేట్ చేసుకొని ఆ సంతోషం తాలూకు ఫోటోలను ట్వీట్ చేసింది నమ్రత . ఆ ఫోటోలలో దర్శకుడు వంశీ పైడిపల్లి తో పాటుగా మహేష్ బాబు ఇతరులు కూడా ఉన్నారు . అయితే ఆ ఫోటోలో నమ్రత మాములుగా ఉంది దాంతో ఓ నెటిజన్ ఏదైనా ఫోబియా తో భాదపడుతున్నావా ? లేక డిప్రెషన్ లో ఉన్నావా ? నమ్రత నువ్ మేకప్ ఎందుకు వేసుకోవు ? అంటూ ప్రశ్నించాడు .

దాంతో చిర్రెత్తుకొచ్చిన నమ్రత అంతే ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది ఆ నెటిజన్ కు . మేకప్ వేసుకునే మహిళలనే ప్రేమిస్తావనుకుంటా ……. ఇకపై నీ ఆలోచనా సరళి ఉన్నవాళ్లనే ఫాలో అవ్వు ఇక్కడి నుండి దొబ్బెయ్ అనే రేంజ్ లో కామెంట్ చేసింది నమ్రత . దాంతో మహేష్ ఫ్యాన్స్ నమ్రతకు అండగా నిలబడ్డారు . నమ్రత ని పొగడుతూ మంచి రిప్లయ్ ఇచ్చారు మేడం అంటూ ట్వీట్ చేస్తున్నారు .