రొమాంటిక్ ఫొటోని షేర్ చేసిన న‌మ్ర‌త‌‌!


Mahesh Babu- Namrata: We have one live to live and one life to give
Mahesh Babu- Namrata: We have one live to live and one life to give

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటిప‌ట్టునే వుంటున్న చాలా మందికి అత్య‌ధిక శాతం రొమాంటిక్ ఆలోచ‌న‌ల్లో తేలిపోతున్నారు. సెల‌బ్రిటీల్లో అత్య‌ధిక శాతం రొమాంటిక్ ఆలోచ‌న‌ల్లోనే మునిగితేలుతున్నారు. వ‌రుస‌గా గుడ్ న్యూస్‌లు చెబుతున్నారు. బాలీవుడ్ క‌పుల్ సైఫ్ అలీఖాన్ – క‌రీనా క‌పూర్‌, విరాట్ కోహ్లీ – అనుష్క శ‌ర్మ ఈ లాక్‌డౌన్‌ని బాగానే ఎంజాయ్ చేశారు.

ఇటీవ‌లే గుడ్ న్యూస్ చెప్పిన వీరు త్వ‌ర‌లో పేరెంట్స్ కాబోతున్న విష‌యం తెలిసిందే. ఇదే త‌ర‌హాలో కాక‌పోయినా కొంత భిన్నంగా మ‌హేష్న‌మ్ర‌త జోడీ వార్త‌ల్లో నిలుస్తోంది. లాక్‌డౌన్ బిఫోర్ భార్య పిల్ల‌ల‌తో గ‌డిపిన సంద‌ర్భాల‌ని ప్ర‌త్యేకంగా వెల్ల‌డించ‌ని మ‌హేష్ ఈ మ‌ధ్య భార్య న‌మ్ర‌త‌, పిల్ల‌లు గౌత‌మ్‌, సితార‌ల‌కు సంబంధించిన  ప్ర‌తీ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటున్నారు. అదే విధంగా న‌మ్ర‌త కూడా అనేక విష‌యాల్ని నెటిజ‌న్స్‌తో పంచుకుంటోంది.

తాజాగా మ‌హేష్ ఒడిలో కూర్చున్న ఓ రొమాంటిక్ ఫొటోని న‌మ్ర‌త షేర్ చేసింది. ఈ ఫొటోతో పాటు ఓ ప్రేమ సందేశాన్ని షేర్ చేసింది. `ప్రేమే అన్నింటికీ మూల‌మ‌ని, అదే మ‌న‌ల్ని ప‌రిపాలిస్తుంద‌ని త‌ను బ‌లంగా న‌మ్ముతాన‌ని వెల్ల‌డించింది. ప్రేమ మాత్ర‌మే మ‌న‌ల్ని సంతోషంగా జీవించ‌డానికి వీలు క‌ల్పిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. ద‌య‌, క‌రుణ అనేవి ప్రేమ‌నుంచి పుట్టినవే అని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం న‌మ్ర‌త షేర్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.