విల‌క్ష‌ణ న‌డుటు నానా ప‌టేక‌ర్ కూడా నేను సైతం..!


విల‌క్ష‌ణ న‌డుటు నానా ప‌టేక‌ర్ కూడా నేను సైతం..!
విల‌క్ష‌ణ న‌డుటు నానా ప‌టేక‌ర్ కూడా నేను సైతం..!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంపంలోని దేశాల‌న్నీ మ‌ర‌ణమృదంగం మోగిస్తున్నాయి. ఎక్క‌డ చూసినా.. ఏ దేశ వార్త‌లు విన్నా క‌రోనా మ‌ర‌ణాలే. క‌రోనా పాజిటివ్ కేసులే. ల‌క్ష‌ల్లో కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు దీన్నీ అంతం చేయాలంటే నివార‌ణ ఒక్క‌టే మార్గం అని ప్ర‌భుత్వాలు గ‌గ్లోలు పెడుతున్నాయి. ఆ మాట‌ల్ని కొంత మంది ఆక‌తాయిలు, తోలు మందం జ‌నాలు ప‌ట్టించుకోకుండా రోడ్లెక్కుతున్నారు.

చాలా మంది ఇంళ్ల‌కే ప‌రిమిత‌మై క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇదిలా వుంటే క‌రోనా క‌ట్ట‌డికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించి కరోనా క‌ట్ట‌డికి న‌డుం బిగించాయి ,అయితే లాక్డౌన్ కార‌ణంగా సామాన్యులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో పీఎం, సీఎం స‌హాయ నిధికి విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. ఇందులో సినీ వ‌ర్గాలే అధికంగా క‌నిపిస్తున్నాయి.

తాజాగా బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ పీఎం స‌హాయ‌నిధికి 25 కోట్లు ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు నానా ప‌టేక‌ర్ క‌రోనాపై యుద్దానికి పీఎం స‌హాయ నిధికి 50 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన త‌న స‌హృద‌యాన్ని చాటుకున్నారు. నానా ఫౌండేష‌న్ త‌రుపున ఈ మొత్తాన్ని నానా ప‌టేక‌ర్ అందించ‌బోతున్నారు.