బాలయ్య బోయపాటి సినిమాకి లైన్ క్లియర్


Balakrishna And Boyapati Srinu
బాలయ్య బోయపాటి సినిమాకి లైన్ క్లియర్

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను గత సంవత్సరం వినయ విధేయ రామ చిత్రంతో గట్టి దెబ్బ తిన్నాడు. తన దర్శకత్వంపైనే సందేహాలు రేకెత్తేలా అవుట్ పుట్ రావడంతో బోయపాటి డల్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో అప్పటికి లైన్లో ఉన్న బాలయ్య – బోయపాటి ప్రాజెక్ట్ ఇక ఉండదని అందరూ భావించారు. దానికి తగ్గట్లే బాలయ్య ముందు కె. ఎస్. రవికుమార్ సినిమా మొదలుపెట్టడంతో బోయపాటి ప్రాజెక్ట్ అటకెక్కినట్లే అని అందరూ భావించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం బోయపాటి – బాలయ్య సినిమా ఆగిపోలేదని తెలుస్తోంది. ఇటీవలే బాలయ్యను కలిసిన బోయపాటి స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ వినిపించాడట. అది తెగ నచ్చేయడంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కె.ఎస్. రవి కుమార్ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే డిసెంబర్ నుండి ఈ చిత్రం మొదలవుతుందిట. ఏదేమైనా బోయపాటి ప్రాజెక్ట్ మళ్ళీ సెట్ అవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ యమ ఖుషీగా ఉన్నారు.

Credit: Facebook