కృష్ణకుమారి మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం


అలనాటి మేటి తార కృష్ణకుమారి నేడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. రామారావుగారు ఎన్.ఏ.టి సంస్థలో తొలిసారి స్వయంగా నిర్మించిన “పిచ్చి పుల్లయ్య”(1953)తో సహా దాదాపు పాతిక సినిమాల్లో కృష్ణకుమారి నాన్నగారి సరసన కథానాయికగా నటించారు. “దేవాంతకుడు, బందిపోటు, ఉమ్మడి కుటుంబం, వరకట్నం” లాంటి సంచలన విజయం సాధించిన చిత్రాల్లోనూ నాన్నగారి సరసన కృష్ణకుమారి నటించడం విశేషం. అటువంటి మేటి నటీమణి నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబసభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని కోరుకొంటున్నా.