హీరోయిన్లను ఫైనల్ చేస్తున్న బాలయ్య


nandamuri balakrishna finalizing heroines for his next
nandamuri balakrishna finalizing heroines for his next

నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. అసలే సీనియర్ హీరోలకు సరైన కథలు దొరకట్లేదన్న న్యూస్ ఉంది. పైగా బాలయ్యకు ఇప్పుడు హిట్ కొట్టడం తప్పనిసరి. ఎంతో నమ్మి చేసిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా దెబ్బకొట్టాయి. అటు నిర్మాతగానే కాకుండా ఇటు హీరోగా కూడా దెబ్బతిన్నాడు బాలకృష్ణ. అందుకే హిట్ కొట్టి తన మార్కెట్ ను కాపాడుకోవాలి. ఈ మధ్య కాలంలో బాలయ్య నుండి నిఖార్సైన హిట్ అన్నదే లేదు. అయితే ఈసారి దాన్ని మార్చాలనుకుంటున్నాడు.

ప్రస్తుతం బాలకృష్ణ తన 105వ సినిమా రూలర్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. డిసెంబర్ 20న విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. దీంతో బాలయ్య తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తన తర్వాతి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న విషయం తెల్సిందే. బోయపాటి శ్రీను కూడా వినయ విధేయ రామ సినిమాతో దారుణమైన ప్లాప్ కొట్టి ఉన్నాడు కాబట్టి ఈసారి పకడ్బందీగా స్క్రిప్ట్ ను సిద్ధం చేసాడట.

మరోవైపు బోయపాటి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటే బాలకృష్ణ హీరోయిన్లను ఫైనల్ చేసే బాధ్యతను తీసుకున్నాడట. ఈ సినిమాలో కూడా ప్రతి బాలయ్య సినెమాలోలానే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. దాంతో హీరోయిన్లుగా ఎవరైతే బాగుంటారో బాలయ్య ఒక లిస్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ ప్రిఫెరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అంటూ డివైడ్ చేసి తన మ్యానేజర్లకు ఇచ్చాడట. దాని ప్రకారం బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్స్ చేస్తారని తెలుస్తోంది. మరి నిజంగానే ఇలానే జరుగుతోందా లేక మాములు పద్దతిలో జరుగుతోందా అన్నది అధికారిక సమాచారం లేదు కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్ మాత్రం ఇదే.