తండ్రి గెటప్ లో బాగున్న బాలయ్య


nandamuri balakrishna getup from ntr biopicవిశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గెటప్ లో నందమూరి బాలకృష్ణ ఎలా ఉంటాడో పూర్తిగా తెలీదు దాంతో కొద్దిగా అనుమానం ఉండేది కానీ తాజాగా బాలయ్య లుక్ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎలా ఉంటుందో తెలియజేస్తూ రిలీజ్ చేసారు . ఆ లుక్ లో బాలయ్య ఎన్టీఆర్ ని తలపించాడు దాంతో ఆ గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని బాలయ్య గెటప్ విడుదల చేసారు . ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలతో అప్పట్లో ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉన్నాడు బాలయ్య .

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ పై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి . బాలయ్య తో పాటుగా మోహన్ బాబు , విద్యా బాలన్ , రానా , రకుల్ ప్రీత్ సింగ్ , మంజిమా మోహన్ , నరేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మొత్తానికి బాలయ్య గెటప్ కు విశేష స్పందన వస్తోంది దాంతో బాలయ్య తో పాటుగా ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .

English Title: nandamuri balakrishna getup from ntr biopic