బాలయ్య, సీనియర్ హీరోయిన్ మధ్య ఫ్యామిలీ సాంగ్!!బాలయ్య, సీనియర్ హీరోయిన్ మధ్య ఫ్యామిలీ సాంగ్!!
బాలయ్య, సీనియర్ హీరోయిన్ మధ్య ఫ్యామిలీ సాంగ్!!

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందు ఒక షెడ్యూల్ నడిచింది. దాదాపు 10 రోజుల పాటు ఒక భారీ యాక్షన్ బ్లాక్ ను షూట్ చేసారు. అలాగే ఇదే ఎపిసోడ్ నుండి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా చిన్న టీజర్ ను వదిలారు. అందులో బాలయ్య లుక్ కానీ, పవర్ఫుల్ డైలాగ్ కానీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీనా ప్రముఖ పాత్రలో కనిపిస్తుందని, సీనియర్ బాలకృష్ణకు భార్య పాత్రలో ఆమె కనిపిస్తుందని సమాచారం. యంగ్ వెర్షన్ బాలకృష్ణ కోసం ఒక కొత్త హీరోయిన్ ను కూడా తీసుకున్నారట.

ఇక బాలకృష్ణ, మీనాల మధ్య ఎపిసోడ్ చాలా స్పెషల్ గా ఉంటుందిట. వీరి మధ్య వచ్చే సాంగ్ సినిమాలో మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు.

బాలయ్యతో సింహా, లెజండ్ వంటి సూపర్ డూపర్ హిట్స్ ను అందించిన బోయపాటి మూడోసారి కలిసి చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయ్. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.