హరికృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య

Nandamuri balakrishna sensational comments on harikrishnaఅన్నయ్య మొరటోడు అంటూ ఎవ్వరి మాటా వినడు అంటూ నందమూరి హరికృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు నందమూరి బాలకృష్ణ . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన అరవింద సమేత వీర రాఘవ చిత్ర విజయోత్సవ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యాడు . కాగా ఆ వేడుకలో పాల్గొన్న బాలయ్య అన్నయ్య హరికృష్ణ పై ప్రేమాభిమానాలు కురిపిస్తూ మాట్లాడిన బాలయ్య ఒకదశలో అన్నయ్య చాలా మొరటోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు . అంతేకాదు అంతటి మొరటుతనం ఉన్నప్పటికీ మనసు మాత్రం వెన్న లాంటిదని , చైతన్య రధసారధిగా నాన్నకు ఏనలేని సేవలు అందించాడని హరికృష్ణ తెలుగుదేశం పార్టీకి , సీనియర్ ఎన్టీఆర్ కు చేసిన సేవలను అభిమానులకు తెలిపాడు .

ఇక ఎన్టీఆర్ పై కూడా తన ప్రేమని వ్యక్తం చేస్తూ తను నటించిన అరవింద సమేత చిత్రం పై ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపించాడు . బాలయ్య హరికృష్ణ , ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ల ప్రస్తావన తెచ్చిన ప్రతీసారి నందమూరి అభిమానులు చప్పట్లతో హాలంతా మారుమోగేలా చేసారు . ఈలలు , గోలలతో శిల్పకళా వేదిక దద్దరిల్లిపోయింది . ఇక ఎన్టీఆర్ కూడా నాన్న హరికృష్ణ ని తలుచుకుంటూ ఆ లోటు బాలయ్య బాబాయ్ తీర్చాడని ఆనంద బాష్పాలతో పులకించిపోయాడు . ఒకే ఫ్రేం లో బాలయ్య బాబాయ్ తో ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు కనిపించడంతో నందమూరి అభిమానులు కూడా పులకించిపోయారు .

English Title: Nandamuri balakrishna sensational comments on harikrishna