హరికృష్ణ అంత్యక్రియలు పూర్తి


nandamuri harikrishna funerals completed

నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి కళ్యాణ్ రామ్ చితికి నిప్పటించాడు . నందమూరి కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లు అంతిమ దహన సంస్కారాలు నిర్వహించారు ,ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పలువురు రాజకీయ నాయకులు ,తెలుగుదేశం పార్టీ అభిమానులు ,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ అంతిమయాత్ర లో పాల్గొని హరికృష్ణ పార్దీవ దేహానికి నివాళులర్పించారు . మెహిదీపట్నం లోని హరికృష్ణ ఇంటి నుండి టోలిచౌకి , షేక్ పేట్ ల మీదుగా మహాప్రస్థానం చేరుకుంది అంతిమయాత్ర . దారి పొడవునా వేలాదిమంది జనం హరికృష్ణ కు కడసారి వీడ్కోలు పలికారు . ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హరికృష్ణ పాడె మోయడం విశేషం . హరికృష్ణ గౌరవార్థం పోలీసులు గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు . హరికృష్ణ గౌరవార్థం మహాప్రస్థానంలో నాలుగు వందల గజాల స్థలంలో స్మారక స్థూపాన్ని నిర్మించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది .

English Title: nandamuri harikrishna funerals completed