హరికృష్ణ పాత్ర పెంచుతున్నారట


Nandamuri kalyan ram joins ntr biopicఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నందమూరి బాలకృష్ణ డిసైడ్ అయ్యాడట ! అసలు ఎన్టీఆర్ బయోపిక్ అనుకున్నప్పుడు హరికృష్ణ పాత్రకు కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉన్నాయట ఎందుకంటే అప్పుడు హరికృష్ణ కు బాలయ్య కు అంతగా పొసగడం లేదు కాబట్టి కానీ ఈమధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించడంతో నందమూరి కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది . దాంతో హరికృష్ణ పాత్ర కు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారట ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో తనయులందరిలోకెల్లా ప్రాముఖ్యత హరికృష్ణదే ! తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు పదవిని తీసుకోకుండా .

నిస్వార్థంగా తండ్రికి అండగా నిలిచి చైతన్య రథసారధిగా వ్యవహరించింది హరికృష్ణ కాబట్టి ఆ పాత్రని గొప్పగా మలచాలని అనుకుంటు న్నారట బాలయ్య దర్శకులు క్రిష్ కూడా . ఇక హరికృష్ణ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న విషయం తెలిసిందే . కళ్యాణ్ రామ్ ఈ పాత్ర చిత్రీకరణ కోసం 25 రోజుల సమయం కేటాయించాడట అంటే ఇక్కడే అర్ధం చేసుకోవచ్చు హరికృష్ణ పాత్రకు ప్రాధాన్యం ఇచ్చారా ? లేదా? అనే విషయం . కళ్యాణ్ రామ్ ఎలాగూ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరడం ఖాయమని అంటున్నారు ఆ చిత్ర బృందం .

English Title: Nandamuri kalyan ram joins ntr biopic