కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్


nandamuri kalyan ram shocked with naa nuvveనందమూరి కళ్యాణ్ రామ్ మొదటి నుండి విభిన్న తరహా కథా చిత్రాలను చేస్తూ తనకంటూ ఓ అభిరుచి ని ఏర్పరచుకున్నాడు దాంతో అతడి కి భిన్నమైన ఇమేజ్ ఏర్పడింది అయితే ఎంతగా భిన్నమైన కథానాయకుడు అని అనుకున్నప్పటికీ నందమూరి అనే బ్రాండ్ ఉండనే ఉంది దాంతో పాపం ఇబ్బంది పడుతున్నాడు కళ్యాణ్ రామ్ . నందమూరి బ్రాండ్ అంటే యాక్షన్ , అయితే యాక్షన్ ని పక్కన పెట్టి రొమాంటిక్ జోనర్ ని టచ్ చేసి ఘోరంగా దెబ్బతిన్నాడు ” నా నువ్వే ” చిత్రంతో .

జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన నా నువ్వే చిత్రం ఘోర పరాజయం కావడంతో కళ్యాణ్ రామ్ చాలా డిజప్పాయింట్ అయ్యాడు . ఇక ఓవర్ సీస్ లో అయితే ఈ సినిమాని కేవలం ఒక్క షోతోనే తీసిపడేసారు స్క్రీన్ ల నుండి . ఇక అదే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎదురయ్యింది . నా నువ్వే చిత్రం జూన్ 14న విడుదలై డిజాస్టర్ టాక్ రావడంతో ఆ సినిమా థియేటర్ ల వద్ద జనాలు లేరు దాంతో ఆ సినిమాని తీసిపడేసారు . నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది నా నువ్వే .