హాట్ బ్యూటీ తో తేజ వెబ్ సిరీస్ !


హాట్ బ్యూటీ తో తేజ వెబ్ సిరీస్ !
హాట్ బ్యూటీ తో తేజ వెబ్ సిరీస్ !

కరోనా వైరస్ కారణంగా ధియేటర్స్ మూసేయడం… షూటింగ్ లు ఆపేయడం తో వినోదం కోసం అంతా ఓటిటీ లని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఓటిటీ లకు మునుపెన్నడూ లేనంతగా భారీ డిమాండ్ పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో వెబ్ సిరీస్ లే బెటర్ అని నమ్మిన వాళ్లంతా వరుసగా వెబ్ సిరీస్ లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది నటీనటులు వెబ్ బాటపట్టారు.

తెలుగులో ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. తాజాగా డైరెక్టర్ తేజ కూడా వెబ్ బాటపడుతున్నారు. బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ తో ఓ హాట్ వెబ్ సిరీస్ కి దర్శకుడు తేజ శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ని తేజ మొదలుపెట్టారని దీనికి సంబందించిన మరిన్ని వివరాల్ని తేజ అఫీషియల్ గా ప్రకటించనున్నారట.
ఇదిలా ఉంటే తేజ రెండు క్రేజీ ప్రాజెక్ట్ లని ప్రకటించిన విషయం తెలిసిందే. గోపీచంద్ హీరోగా ‘అలిమేలుమంగా వెంకటరమణ’, రానా హీరోగా ‘రాక్షసరాజు రావణాసురుడు’ చిత్రాలు చేయబోతున్నారు . ఈ రెండు చిత్రాల్లో అలిమేలుమంగా వెంకటరమణ ఈ ఏడాది చివరలో ప్రారంభం కానుంది.