నందితా శ్వేత‌కు షాకిచ్చిన హ్యాక‌ర్స్‌!

 

Nanditha swetha inasta acount haked by hackers
Nanditha swetha inasta acount haked by hackers

నిఖిల్ హీరోగా న‌టించిన థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా?`. ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది నందితా శ్వేత‌. తొలి మూవీతో న‌టిగా మంచి మార్కుల కొట్టేసింది. ఈ మూవీలో ఘోస్ట్‌గా త‌న‌దైన శైలిలో న‌టించి మంచి గుర్తింపుని ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం సుమంత్ హీరోగా న‌టించిన `క‌ప‌ట‌ధారి` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 19నే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇదే నెల‌లో 26న నందితా శ్వేత న‌టించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ `అక్ష‌ర‌` కూడా విడుద‌ల కాబోతోంది. ఇదిలా వుంటే నందితా శ్వేత‌కి హ్యాక‌ర్స్ షాకిచ్చార‌ట‌. ఈ విష‌యాన్ని నందితా శ్వేత సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది.

త‌న ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్‌కు గురైంద‌ని, దాని నుంచి వ‌చ్చే మెసేజ్‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వుండాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. గ‌త కొంత కాలంగా నందితా శ్వేత ఇన్ స్టా వేదిక‌గా త‌న ఫొటో షూట్‌కి సంబంధించిన పిక్‌ల‌ని అభిమమానుల‌తో పంచుకుంటున్న విష‌యం తెలిసిందే.