బీబీ అంటూ కన్ఫ్యూజ్ చేసి ఫైన‌ల్‌గా క్లారిటీ ఇచ్చాడు!


 

nandu new film Bomma block buster
nandu new film Bomma block buster

బిగ్‌బాస్ సీజ‌న్ 4పై చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌ బీబీ అంటూ ఇన్ స్టా వేదిక‌గా కన్ఫ్యూజ్ చేసిన న‌టుడు నందు మొత్తానికి షాకిచ్చాడు. బీబీ అంటే బిగ్ బాస్ కాద‌ని `బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌` అని క్లారిటీ ఇచ్చాడు. `డార్లింగ్స్ నేను బీబీలో వున్నాను. బీబీలో మ‌న ర‌చ్చ మ‌మూలుగా వుండ‌దు. మీకు మ‌రింత వినోదాన్ని అందించ‌బోతున్నాం. ఇందుకు మీ స‌హ‌కారం కావాలి. అయితే రేపు సాయంత్రం 6 గంట‌ల‌కు మ‌రో అప్‌డేట్ రెడీగా వుంది. మ‌ళ్లీ ఇక్క‌డే క‌లుద్దాం` అని కన్ఫ్యూజ్ చేసిన నందు మొత్తానికి క్లారిటీ ఇచ్చాడు.

బీబీ అంటే త‌ను న‌టిస్తున్న తాజా చిత్రం టైటిల్ `బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌` అని రివీల్ చేశాడు. నందు హీరోగా న‌టిస్తున్న చిత్ర‌మిది. హాట్ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. విజయీభ‌వ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌వీణ్ ప‌గ‌డాల, బోస్ నిడిమోలు, ఆనంద్‌రెడ్డి మ‌డ్డి, మ‌నోహ‌ర్‌రెడ్డి ఈడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ విరాఠ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

గ‌తంతో పోలిస్తే హీరోగా నందు మ‌ళ్లీ స్పీడు పెంచారు. స‌వారి వంటి చిత్రంతో అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా ఫ‌లితం ద‌క్క‌లేదు. తాజాగా `బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌` సినిమాపై నందు భారీ అంచ‌నాలు పెట్టుకున్నార‌ట‌. ర‌ష్మీగౌత‌మ్ న‌టిస్తున్న సినిమా కావ‌డం, విభిన్న‌మైన నేప‌థ్యంలో రూపొందుతున్న ఇనిమా కావ‌డంతో ఈ చిత్రం ఖ‌చ్చితంగా నందుకు మంచి బ్రేక్‌ని ఇవ్వ‌డం ఖాయం అని చెబుతున్నారు.