ఇద్ద‌రు స్నేహితుల‌తో సురేష్‌బాబు మ‌ల్టీస్టార‌ర్‌?



ఇద్ద‌రు స్నేహితుల‌తో సురేష్‌బాబు మ‌ల్టీస్టార‌ర్‌?
ఇద్ద‌రు స్నేహితుల‌తో సురేష్‌బాబు మ‌ల్టీస్టార‌ర్‌?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్య మంచి స్నేహ బంధం నెల‌కొని వుంది. మ‌న టాలీవుడ్ హీరోల్లో చాలా మంది మంచి మిత్రులు కూడా వున్నారు. అలాంటి మిత్రుల్లో నేచుర‌ల్ స్టార్ నాని, రానా ద‌గ్గుబాటి జోడీ ఒక‌టి. ఆ మ‌ధ్య ఇఫా అవార్డుల వేడుక‌లో వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌కు నాగార్జునతో స‌హా అవార్డుల వేడుక‌లో పాల్గొన్న సెల‌బ్రిటీలంతా బిత్త‌ర‌పోయారు.

రానా అస‌లు హీరో ఎలా అయ్యాడ‌ని నాని చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో పెను దుమారాన్ని సృష్టించాయి. ఆ త‌రువాత రానా కూడా నాని పై అదే స్థాయి సంచ‌ల‌నం సృష్టించారు. ఇదంతా అవార్డుల వేడుక‌పై అటెన్ష‌న్‌ని క్రియేట్ చేయ‌డం కోస‌మేని తేల‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ఈ హీరోలు క‌లిసి  ఓ మ‌ల్టీ స్టార‌ర్ సినిమా చేస్తే ఎలా వుంటుంది? ఇదే ఆలోచ‌న బ‌డా ప్రొడ్యూస‌ర్ డి. సురేష్‌బాబుకు వ‌చ్చింద‌ట‌.

ఇంకే ముందు ఐడియా చెప్పేసి ఓ ప్ర‌ముఖ రైట‌ర్‌తో క‌థ‌ని సిద్ధం చేయిస్తున్నార‌ట‌. ఇది ఎప్పుడు  మొద‌ల‌వుతుంది? ‌దీన్ని డీల్ చేసే ద‌ర్శ‌కుడు ఎవ‌రు అన్న‌ది మాత్రం ఇంకా స్ప‌ష్టం కాలేదు. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన పూర్తి వివ‌రాల్ని డి. సురేష్ బాబు వెల్ల‌డించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం నాని, రానా వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా వున్న విష‌యం తెలిసిందే.