మ‌రోసారి జ‌త‌క‌డుతున్న `ఎంసీఏ` జోడీ?


మ‌రోసారి జ‌త‌క‌డుతున్న `ఎంసీఏ` జోడీ?

మ‌రోసారి జ‌త‌క‌డుతున్న `ఎంసీఏ` జోడీ? 

శ్రీ‌రామ్ వేణు తొలి విజ‌యాన్ని ద‌క్కించుకున్న చిత్రం `ఎంసీఏ`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నాని, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్‌లుగా న‌టించారు. 2017 డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్ర విజ‌యంలో కీల‌క పాత్ర పోషించింది నాని, సాయి ప‌ల్ల‌విల కెమిస్ట్రీ. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ హిట్ కాంబినేష‌న్‌గా పాపుల‌ర్ అయింది.

తాజాగా ఈ కాంబినేష‌న్ మ‌ళ్లీ సెట్ట‌వుతోంది. `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ఈ చిత్రానికి `శ్యామ్ సింగ్ రాయ్‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన టీజ‌ర్‌ని ఇటీవ‌లే చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ చిత్రం కోసం నానికి జోడీగా సాయి ప‌ల్ల‌విని ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది.

ఓల్డ్ కోల్‌క‌తా నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఇందు కోసం హైద‌రాబాద్ ఔట్ స్క‌ర్ట్‌లో ఓల్డ్ కోల్ క‌తా సెట్‌ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం నాని `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ పూర్త‌యిన త‌రువాత `శ్యామ్ సింగ్ రాయ్‌` చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తార‌ట‌.