జ‌గ‌దీష్ జాయ‌న్ అయ్యాడు.. ట‌క్ మొద‌లైంది!

జ‌గ‌దీష్ జాయ‌న్ అయ్యాడు.. ట‌క్ మొద‌లైంది!
జ‌గ‌దీష్ జాయ‌న్ అయ్యాడు.. ట‌క్ మొద‌లైంది!

నేచుర‌ల్ స్టార్ నాని కూడా మొద‌లుపెట్టాడు. గ‌త ఏడు నెల‌లుగా ఆగిపోయిన త‌న సినిమా షూటింగ్‌ని బుధ‌వారం నుంచి ప్రారంభించేశాడు. నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. రార‌నికి `నిన్ను కోరి` వంటి ప్రేమ‌క‌థా చిత్రా‌న్ని అందించిన శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మార్చిలో ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఎట్ట‌కేల‌కు మొద‌లైంది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా హీరో నాని సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదిక‌గా వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియాలో మాస్క్ ప‌ట్టుకుని సెట్లో నిలుచున్న ఓ ఫొటోని షేర్ చేసిన నాని `జ‌గ‌దీష్ జాయ‌న్ అయ్యాడు.. ట‌క్ మొద‌లైంది` అంటూ కామెంట్ చేశారు. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `పెళ్లి చూపులు` ఫేమ్ రితూ వ‌ర్మ, ఐశ్వ‌ర్యారాజేష్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ‌

త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ముందు అనుకున్న ప్ర‌కారం జూలై 3న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా రిలీజ్ ప్లాన్ మొత్తం మారిపోయింది. దీంతో ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఫ‌స్ట్ హాఫ్‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల్ని బ‌ట్టి రిలీజ్ డేట్‌ని వ‌చ్చే ఏడాదికి మార్చి న‌ట్టు తెలిసింది.