మరోసారి కామెడీని నమ్ముకుంటున్న నాని


Nani
మరోసారి కామెడీని నమ్ముకుంటున్న నాని

కామెడీని నమ్ముకున్న ప్రతిసారి నాని విజయం సాధించాడు. మధ్యలో ఎమోషనల్ కంటెంట్ అంటూ జెర్సీ వంటి ప్రయత్నాలు చేసినా అవి మంచి ఓరు తెచ్చిపెట్టాయి కానీ డబ్బులు మాత్రం తేలేదు.

అందుకే మరోసారి నాని గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా కామెడీ ప్రధానాయుధంగా బరిలోకి దిగబోతున్నాడు. అవ్వడానికి ఇది ఒక రివెంజ్ సినిమానే అయినా దర్శకుడు విక్రమ్ కుమార్ దీన్ని కామెడీ టచ్ తో తెరకెక్కించాడు. ఈ విషయం టీజర్, ట్రైలర్ చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది. కామెడీ అంటే నాని చెలరేగిపోతాడు.

టాలీవుడ్ బెస్ట్ కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో నాని ముందు వరుసలో ఉంటాడు. నాని బిగ్గెస్ట్ హిట్ భలే భలే మగాడివోయ్ కూడా కామెడీ ప్రధానంగా సాగేదే. మరి మరోసారి గ్యాంగ్ లీడర్ తో కామెడీ సెంట్రిక్ ఫిల్మ్ చేసాడు నాని. దీని రిజల్ట్ ఎలా ఉండబోతోందో చూద్దాం.