నాని ఆ సినిమా రిజల్ట్ కోసం చూస్తున్నాడట


Nani eyes on tamil remake

నాని తన తదుపరి చిత్రాన్ని చేయడానికి ఓ సినిమా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాడట ! అయితే అది దేవదాస్ చిత్రం కాదు సుమా ! అక్కినేని నాగార్జున తో కలిసి నాని నటించిన మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ ఈనెల 27న విడుదలకు సిద్ధమైంది . అయితే నాని ఎదురు చూస్తున్నది దేవదాస్ రిజల్ట్ కోసం కాదు తమిళంలో అక్టోబర్ 4న ”96 ” అనే చిత్రం విడుదల అవుతోంది . విజయ్ సేతుపతి – త్రిష జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు చెన్నై వెళ్లి చూసి నచ్చడంతో రీమేక్ హక్కులు తీసుకున్నాడు , అయితే 96 చిత్రం హిట్ అవుతుందా ? లేదా ? అన్నది మాత్రం అక్టోబర్ 4న తేలనుంది .

అక్టోబర్ 4న రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఆ రీమేక్ లో నటించే అవకాశం ఉంది . ఇప్పటికే నాని – దిల్ రాజుల మధ్య ఓ దఫా చర్చలు జరిగాయట ! ప్రస్తుతం నాని దేవదాస్ రిలీజ్ హడావుడిలో ఉన్నాడు కాబట్టి అది అయ్యాక 96 రీమేక్ మీద ద్రుష్టి పెట్టనున్నాడు . వరుస ప్లాప్ లతో దిల్ రాజు ఇబ్బంది పడుతున్నాడు కాగా నాని తో 96 చిత్రాన్ని రీమేక్ చేయాలనీ ఉత్సాహపడుతున్నాడు కానీ అక్టోబర్ 4న రిజల్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు తేలిపోనుంది .

English Title: Nani eyes on tamil remake