నాని పోటీని తట్టుకోగలడా ?


న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న జెర్సీ చిత్రాన్ని ఈనెల 19 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే అదే రోజున సూపర్ హిట్ చిత్రాల సిరీస్ లో భాగంగా వస్తున్న ” కాంచన 3′‘ చిత్రం కూడా రిలీజ్ అవుతోంది . రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన చిత్రం కాంచన 3 . ఇప్పటివరకు వచ్చిన ముని , గంగ , కాంచన చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి దాంతో నాని కి తీవ్ర పోటీ ఏర్పడింది .

హర్రర్ చిత్రమైన కాంచన 3 నవ్విస్తూ , భయపెడుతూ వినోదాన్ని పంచె చిత్రం . ఇప్పటికే ఆ సిరీస్ లలో వచ్చిన మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి కాంచనపై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం . ఆ పోటీని నాని ఎలా తట్టుకుంటాడు , జెర్సీ కోసం ప్రేక్షకులు వచ్చేలా ఎలా చేస్తాడు ? కాంచన 3 ని ఎలా ఢీ కొంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది . జెర్సీ , కాంచన 3 చిత్రాలు ఒకేరోజున వస్తుండటంతో నాని పైనే ఎక్కువగా ఒత్తిడి ఉంది అయితే ప్రేక్షకులకు ఏది బెటర్ ఆప్శన్ అవుతుందో ? నాని ఈ పోటీని ఎలా తట్టుకుంటాడో ? చూడాలి .