నాని ఫ్యాన్స్ కు గద్దలకొండ గణేష్ అభయం


Gaddalakonda Ganesh
నాని ఫ్యాన్స్ కు గద్దలకొండ గణేష్ అభయం

నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఓ మోస్తరు కలెక్షన్స్ మొదటి వారాంతంలో సాధించింది. అయితే వీక్ డేస్ లో కలెక్షన్స్ వీక్ అవ్వడంతో సినిమా హిట్ అవుతుందా అన్న సందేహాలు వచ్చాయి. తర్వాత వారం వరుణ్ నటించిన గద్దలకొండ గణేష్ విడుదల కావడంతో గ్యాంగ్ లీడర్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది.

అంటే ఒక రకంగా గ్యాంగ్ లీడర్ ప్లాప్ కావడానికి గద్దలకొండ గణేష్ కారణమన్నమాట. మరి టైటిల్ ఏంటి వేరేలా ఉంది అనుకుంటున్నారా, మరక్కడే ఉంది అసలు విషయం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు సాఫ్ట్ ఇమేజ్ ఉంది. తన కెరీర్ లో ఎక్కువగా చేసింది లవ్ స్టోరీస్, అందులో క్లాస్ సినిమాలే. ఈ నేపథ్యంలో మాస్ లుక్ లో విలన్ గా వరుణ్ ను ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న డౌట్ ఉండేది. కానీ గద్దలకొండ గణేష్ బంపర్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

ఇప్పుడు ఈ చిత్రం సాధించిన సక్సెస్ చూసి నాని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నాని తర్వాతి చిత్రం V. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని విలన్ గా నటిస్తున్నాడు. ఎక్కువగా తన కెరీర్ లో సాఫ్ట్ రోల్స్ చేసే నాని విలన్ గా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న ఒక సందేహం ఉంది. ప్రస్తుతం గద్దలకొండ గణేష్ సాధించిన విజయం నాని ఫ్యాన్స్ కు అభయమిస్తుంది అనడంలో సందేహం లేదు.