నీ వంద‌.. నా యాభై.. మ‌న‌మే చేయాలి!


నీ వంద‌.. నా యాభై.. మ‌న‌మే చేయాలి!
నీ వంద‌.. నా యాభై.. మ‌న‌మే చేయాలి!

అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వున్న నానిని హీరోని, నేచుర‌ల్ స్టార్‌ని చేసిన ఘ‌న‌త ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌దే. `అష్టాచ‌మ్మా` చిత్రంతో నాని హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా త‌రువాత నాని హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు. ద‌ర్శ‌కుడిగా ఇంద్రగంటి కూడా అదే జోరుని చూపించాడు. ఆ త‌రువాత కూడా నానితో క‌లిసి ఇంద్ర‌గంటి చేసిన `జెంటిల్‌మ‌న్‌` మంచి విజ‌యాన్ని సాధించింది. తాజాగా వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో మముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమా వ‌చ్చేస్తోంది.

నాని, సుధీర్‌బాబు క‌లిసి న‌టిస్తున్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి`. ఈ చిత్రానికి ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ శుక్ర‌వారం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌న పుట్టన రోజుని సింపుల్‌గా జ‌రుపుకున్నారు. లాక్‌డౌన్‌, క‌రోనా ఎఫెక్ట్ నేప‌థ్యంలో ఇంటి ప‌ట్టునే వుంటున్న ఆయ‌న త‌న బ‌ర్త‌డేని నిరాడంబ‌రంగా జ‌రుపుకున్నారు.

ఈ సంద‌ర్భంగా హీరో నాని, ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ మ‌ధ్య జ‌రిగిన స‌ర‌దా సంభాష‌ణ ఆక‌ట్టుకుంటోంది. మోహ‌న్ స‌ర్ నా 50వ సినిమా మీరే చేయాలి. మీ 25వ సినిమా నేనే చేయాలి అని నాని ట్వీట్ చేస్తే నీ వంద‌వ సినిమా నేనే చేయాలి.. నా యాభైయ‌వ సినిమా నువ్వే చేయాల‌ని స‌ర‌దాగా ట్వీట్ చేశారు.

Credit: Twitter