ప్రభాస్ కోసం తప్పుకుంటున్న నాని


Prabhas And Nani
Prabhas And Nani

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం హీరో నాని తప్పుకుంటున్నాడు . ప్రభాస్ నటించిన సాహో ఈనెల 30 న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న విషయం తెలిసిందే . దాంతో ఆ సినిమాకు పోటీ లేకుండా నాని తన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు . నాని గ్యాంగ్ లీడర్ చిత్రం ఆగస్టు 30 న కాకుండా సెప్టెంబర్ 13 న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారట .

సాహో కు సోలో రిలీజ్ ఉంటే బెటర్ అని భావించిన పలువురు దర్శక నిర్మాతలు తమ సినిమాల విడుదలలను వాయిదా వేసుకున్నారు అందుకే మొన్న ప్రభాస్ దర్శక నిర్మాతలకు థాంక్స్ చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే . సోలో గా వస్తోంది కాబట్టి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి సాహో చిత్రానికి . అయితే టాక్ బాగుంటేనే ఆ తర్వాత నిలకడ లేకపోతే అంతేసంగతులు .