హిట్ కొట్టిన నాని


నాని జెర్సీ చిత్రంతో హిట్ కొట్టాడు . కృష్ణార్జున యుద్ధం , దేవదాస్ చిత్రాలతో వరుసగా దెబ్బ తిని ఉన్న నాని కి జెర్సీ మొత్తానికి ఆక్సీజన్ ని అందించింది . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన జెర్సీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే . ఈ సినిమాపై మొదటి నుండి ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు నాని , అతడి నమ్మకాన్ని నిజం చేస్తూ జెర్సీ చిత్రానికి హిట్ టాక్ రావడంతో చాలా సంతోషంగా ఉన్నాడు .

నాని కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు , దాంతో నాని పై ప్రశంసల వర్షం కురుస్తోంది . ఎమోషనల్ జెర్నీ గా తెరకెక్కింది జెర్సీ . నాని తో పాటుగా శ్రద్దా శ్రీనాథ్ నటనకు కూడా ప్రేక్షకులు మంత్రముగ్దులౌతున్నారు . ఇక నానికి చాలా రోజుల తర్వాత సాలిడ్ హిట్ దక్కడంతో నాని తో పాటుగా నాని ఫ్యాన్స్ కూడా పరవశించిపోతున్నారు . జెర్సీ తో నాని మళ్ళీ సక్సెస్ రూట్ లో పడ్డాడు .