నాని కొత్త సినిమా సభకు నమస్కారం


nani gets new title sabhaku namaskaramబిగ్ బాస్ 2 కో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని ప్రస్తుతం సీనియర్ హీరో నాగార్జున తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . దాని తర్వాత జెర్సీ అనే చిత్రం చేయనున్నాడు అది క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇక వాటి తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ” సభకు నమస్కారం ” అనే చిత్రం చేయనున్నాడట ! ఆ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది .

అయితే ముందుగానే టైటిల్ ని ఫిక్స్ చేసారు ” సభకు నమస్కారం ” అని . బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని కి పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి యాంకర్ గా , ఇంకా బుల్లితెర ప్రేక్షకులను ఎన్టీఆర్ స్థాయిలో అయితే నాని అలరించడం లేదు ప్రస్తుతానికి . ఇంకొద్ది రోజులు గడిస్తే కానీ నాని రాటు దేలడేమో !కృష్ణార్జున యుద్ధం ప్లాప్ కావడంతో సినిమాల ఎంపిక లో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాని అది ఇచ్చిన షాక్ తో . వరుస విజయాలు సాధిస్తున్న నాని కి కృష్ణార్జున యుద్ధం పెద్ద స్పీడ్ బ్రేకర్ అయ్యింది .