రిజెక్ట్ చేసిన కథలంటే నానికి ఎందుకంత ఇష్టం?


Nani
రిజెక్ట్ చేసిన కథలంటే నానికి ఎందుకంత ఇష్టం?

న్యాచురల్ స్టార్ నాని విజయపరంపరకు బ్రేకులు వేసిన చిత్రం కృష్ణార్జున యుద్ధం. అది ఒక రిజెక్టెడ్ స్టోరీ. దర్శకుడు మేర్లపాక గాంధీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఈ కథ రాసుకున్నాడు. అయితే వరసగా సిట్టింగ్స్ అవుతున్నా కథలో క్లారిటీ రాకపోవడంతో రామ్ చరణ్ సైడైపోయాడు. ఆ ప్రాజెక్ట్ వెంటనే నాని దగ్గరకి వచ్చింది. నాని మరో ఆలోచన లేకూండా ఓకే చేసేసాడు. ఫలితంగా సినిమా ప్లాప్.

ఇప్పుడు మళ్ళీ దాదాపు ఇదే సీన్ రిపీట్ అయింది. విక్రమ్ కుమార్, అల్లు అర్జున్ కోసం గ్యాంగ్ లీడర్ కథ రాసుకున్నాడు. అల్లు అర్జున్ కు కథ నచ్చినా, సెకండ్ హాఫ్ పై అభ్యంతరం వ్యక్తం చేసాడు. విక్రమ్, అల్లు అర్జున్ మధ్య ఆలోచనల్లో సారూప్యం కనపడకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది. అది కూడా నాని చేతికే వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ ప్రధాన కంప్లైంట్ అని అందరూ అంటున్నారు. ఫలితం నాని ఖాతాలో మరో ప్లాప్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

రిజెక్టెడ్ స్టోరీస్ చేయడం తప్పేం కాదు. మహేష్ కెరీర్ లో అతడు, పోకిరి, రవితేజ కెరీర్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్.. ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదవుతుంది. ఈ చిత్రాలన్నీ సూపెర్ హిట్స్ అయినవే. వారి వారి కెరీర్స్ లో స్పెషల్ చిత్రాలుగా నిలిచాయి. కానీ ఇక్కడ నానికి మాత్రం రిజెక్టెడ్ స్టోరీస్ చేదు అనుభవాలని మిగుల్చుతున్నాయి.