పూరి తో సినిమా చేసేది లేదన్న నాని


nani gives shock puri jagannadh

వరుసగా ఘోర పరాజయాలు చవిచూస్తున్న దర్శకులు పూరి జగన్నాధ్ తో సినిమా చేయడం లేదని అంటున్నాడు హీరో నాని . తాజాగా నాని బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఒకవైపు బిగ్ బాస్ షో చేస్తూనే మరోవైపు సీనియర్ హీరో నాగార్జున తో మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు నాని . అయితే పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేయనున్నట్లు వార్తలు రావడం తో అవన్నీ గాలి వార్తలే అని పూరి తో సినిమా చేయడం లేదని తేల్చి పడేసాడు నాని .

పూరి జగన్నాధ్ కు గతకొంత కాలంగా కాలం కలిసి రావడం లేదు చేస్తున్న సినిమాలన్నీ ఘోర పరాజయం పొందుతున్నాయి . దాంతో తనయుడు పూరి ఆకాష్ తో మెహబూబా చిత్రం చేసాడు కానీ అది కూడా ప్లాప్ అయ్యింది . వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్నప్పటికీ పూరి జగన్నాధ్ తన కథల విషయంలో మాత్రం అస్సలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు . ఒకప్పుడు పూరి తో సినిమా చేయాలనీ హీరోలు తహతహలాడేవాళ్లు కానీ ఇప్పుడేమో పూరి హీరోల వెంట పడుతున్నప్పటికీ ఒక్క హీరో కూడా కనికరించడం లేదు .