ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథనట అది


nani green signal three heroes rejected chandrsekhar yeleti script

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథ ని సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేసాడట హీరో నాని దాంతో షాక్ అవ్వడం దర్శకుడి వంతు అయ్యింది . విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి . పలువురు హీరోలతో ఈ దర్శకుడు సినిమాలు చేసాడు దాదాపుగా అన్ని సినిమాలు మంచి పేరునే తెచ్చిపెట్టాయి , ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసాయి కానీ కమర్షియల్ హిట్స్ మాత్రం అందుకోలేక పోయాడు ఈ దర్శకుడు . అయితే ఈసారి ఎలాగైనా సరే కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యంతో చాలా మదనపడి కథ ని రెడీ చేసుకున్నాడట !

ముందుగా గోపిచంద్ కి వినిపించాడట దర్శకులు చంద్రశేఖర్ ఏలేటి . గోపీచంద్ తో ఈ దర్శకుడు రెండు చిత్రాలు చేసాడు ,
” ఒక్కడున్నాడు ”, ” సాహసం ” ఈ రెండు సినిమాలు కూడా గోపీచంద్ కు చాలా ప్రత్యేకం అయితే కమర్షియల్ హిట్స్ కావు దాంతో చంద్రశేఖర్ యేలేటి చెప్పిన కథ కు ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్పటికీ తర్వాత తనకు వస్తున్న వరుస ప్లాప్ లతో హ్యాండ్ ఇచ్చాడట . ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ కు కథ చెప్పాడట తాను కూడా ఓకే చెప్పాడు కట్ చేస్తే సాయిధరమ్ తేజ్ కు కూడా వరుసగా అయిదు సినిమాలు ప్లాప్ అయ్యాయి దాంతో చంద్రశేఖర్ యేలేటి కి హ్యాండ్ ఇచ్చాడు మెగా హీరో .

ఇద్దరు హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో నితిన్ కు చెప్పాడట ! కథ విన్న నితిన్ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు అయితే తీరా సమయానికి నితిన్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో నాని ని కలిశాడట ఇక నాని కథ విన్న వెంటనే ఒప్పేసుకున్నాడట ఇంకేముంది ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి అయితే నాని ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు అవి అయ్యాక చంద్రశేఖర్ యేలేటి తో పని చేయనున్నాడు . మరి నాని అయినా చేస్తాడా ? చివరి నిమిషంలో మిగతా హీరోల లాగే హ్యాండ్ ఇస్తాడా చూడాలి .

English Title: nani green signal three heroes rejected chandrasekhar yeleti script