`నేనే లోక‌ల్` టీమ్‌ని మ‌ళ్లీ సెట్‌చేశారా?


Nani Greensignal to Nenu local Director
Nani Greensignal to Nenu local Director

`జెర్సీ`, గ్యాంగ్ లీడ‌ర్` చిత్రాల త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని స్పీడు పెంచారు. ఈ ఏడాద ఇక‌నీసం రెండు లేదా మూడు చిత్రాల్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `వి` చిత్రాన్ని పూర్తి చేసిన నాని దీన్ని మార్చి 25న రిలీజ్‌కి రెడీ చేసేశారు. ఆ వెంట‌నే శివ నిర్వాణ‌తో `ట‌క్ జ‌గ‌దీష్‌`ని మొద‌లుపెట్టేశాడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇందులో నాని కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఇదిలా వుంటే `టాక్సీవాలా` ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రీత్య‌న్‌తో ఓ సినిమాకు క‌మిట్ అయిపోయారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌నున్నారు. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అప్‌డేట్ త్వ‌ర‌లోనే బ‌య‌టికి రాబోతోంది. ఇవే కాకుండా `నేను లోక‌ల్‌` ఫేమ్ త్రినాథ‌రావు న‌క్కిన‌తోనూ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. దీనికి ప్రొడ్యూస‌ర్ ఎవ‌రన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు.

త్రినాథ‌రావు న‌క్కిన గ‌త కొంత కాలంగా విక్ట‌రీ వెంక‌టేష్ కోసం ఓ కాప్ స్టోరీని రెడీ చేస్తున్నారు. అన్నీ స‌వ్యంగా కుదిరితే ఇప్ప‌టికే ఆ సినిమా ప‌ట్టాలెక్కాలి. కానీ స్క్రిప్ట్ మార్పుల కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. దీంతో ఈ గ్యాప్‌ని నాని సినిమాతో ఫిల్ చేయాల‌ని త్రినాథ‌రావు న‌క్కిన ఇటీవ‌లే ఓ కొత్త క‌థ‌ని నానికి వినిపించార‌ట‌. నాని ఓకే చెప్పార‌ని తెలిసింది.