ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో నాని హీరోయిన్!


ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో నాని హీరోయిన్!
ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో నాని హీరోయిన్!

టాలీవుడ్‌లో దాదాపు ఏడేళ్ల క్రితం వ‌చ్చిన చిత్రం `ఆహా కళ్యాణం`. నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నిర్మాణ సంస్థ య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ టాలీవుడ్‌లో ఎంట‌ర్ కావాల‌నుకుంది. కానీ ఆ ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టేసింది. ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన టాల్ సుంద‌రి వాణీ క‌పూర్‌.

తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో బాలీవుడ్‌కే ప‌రిమిత‌మైంది. `శుద్ధ దేశీ రొమాన్స్‌` చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బేఫిక‌ర్‌, వార్ వంటి క్రేజీ చిత్రాల‌తో అక్క‌డ పాగా వేసింది. ప్ర‌స్తుతం రణ్‌బీర్ క‌పూర్ న‌టిస్తున్న పిరియాడిక్ డ్రామా `షంషేరా`, అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టిస్తున్న `బెల్ బాట‌మ్` చిత్రాల్లో న‌టిస్తోంది.

వీటితో పాటు తాజాగా వాణీ క‌పూర్ మ‌రో చిత్రాన్ని అంగీక‌రించింది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్నారు. `చండీగ‌ర్ క‌రే ఆషికీ` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో వాణీక‌పూర్ లింగ‌మార్పిడి చేయించుకున్న ట్రాన్స్ జెండ‌ర్‌గా క‌నిపించ‌బోతోంది. ఈ పాత్ర‌ని వాణీక‌పూర్ ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ముంబైలో జ‌రుగుతోంది.