50 కోట్ల దిశగా నాని జెర్సీ


నాని హీరోగా నటించిన జెర్సీ 50 కోట్ల దిశగా దూసుకుపోతోంది . ఏమాత్రం డివైడ్ టాక్ లేకుండా యునానిమస్ గా హిట్ టాక్ తో దూసుకుపోతున్న జెర్సీ అవలీలగా 50 కోట్ల ని సాధించడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు . నిన్న కేవలం తెలుగు రాష్ట్రాలలోనే ఒక్క రోజులోనే 4. 60 కోట్ల షేర్ రాబట్టింది జెర్సీ . టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో మరిన్ని వసూళ్లు పెరిగుతున్నాయి . దాంతో 50 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు . 
 
జెర్సీ చిత్రానికి ప్రస్తుతానికి పోటీ చిత్రం ఏది లేదు , అలాగే మే 9 న వచ్చే మహేష్ బాబు సినిమానే పోటీ అయితే అప్పటిలోగా తన బిజినెస్ ని క్లోజ్ చేస్తాడు నాని . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మించగా కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది . మొత్తానికి నాని కి ఈ మండు వేసవిలో బ్లాక్ బస్టర్ దొరికేసింది .