జెర్సీ చైనాలో కూడా రిలీజ్ ?


నాని నటించిన జెర్సీ చిత్రాన్ని చైనాలో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన జెర్సీ చిత్రం క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం . క్రికెట్ తో పాటుగా ఫ్యామిలీ ఎమోషన్స్ పుష్కలంగా ఉన్న సినిమా కావడంతో తప్పకుండా చైనా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారట ఆ చిత్ర బృందం .

చైనాలో క్రీడా నేపథ్యంలో రూపొందిన చిత్రాలకు ఆదరణ ఎక్కువ ఉండటంతో ఈ ఆలోచన చేస్తున్నారు జెర్సీ బృందం . అయితే ఇప్పుడే చైనాలో రిలీజ్ కాదు ఎందుకంటే దానికోసం ప్రత్యేకమైన ప్లాన్ తో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు . జెర్సీ ఇక్కడ రిలీజ్ అయ్యాక హడావుడి తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఆదరణని బట్టి స్వల్ప మార్పులేమైనా చేసి అక్కడ రిలీజ్ చేస్తారట . ఇక ఇక్కడ ఏప్రిల్ 19 న విడుదల కానుంది జెర్సీ .