నాని ట్రాక్ రికార్డు అక్కడ బాగా దెబ్బతిందిగా


Nani
నాని ట్రాక్ రికార్డు అక్కడ బాగా దెబ్బతిందిగా

టాలీవుడ్ లో మోస్ట్ బ్యాంకబుల్ హీరోగా నాని గురించి ప్రస్తావించేవారు. సినిమాకు టాక్ ఎలా ఉన్నా కానీ మినిమం కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇక ఓవర్సీస్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా 1 మిలియన్ మార్క్ దాటేవాడు నాని. కానీ ఈ పరిస్థితిలో నెమ్మదిగా మార్పు రావడం మొదలైంది.

కృష్ణార్జున యుద్ధం నుండి వరసగా నాని సినిమాలు అన్నీ ఓవర్సీస్ లో బాల్చీ తన్నేస్తున్నాయి. కృష్ణార్జున యుద్ధం మాస్ సినిమా కావడంతో, అందునా టాక్ యావరేజ్ అవ్వడంతో ప్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన దేవదాస్ కూడా ప్లాప్ టాక్ కారణంగా ఓవర్సీస్ లో కూడా పోయింది. అయితే జెర్సీ సినిమాకి రేటింగ్స్ అదిరిపోయాయి. పైగా అది క్లాస్ సినిమా, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. కచ్చితంగా ఈ సినిమా ఓవర్సీస్ లో విజయం సాధిస్తుందని ఆశిస్తే అది కూడా పరాభవాన్నే మిగిల్చింది.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ తొలి వారాంతంలోనే 600K డాలర్లు వసూలు చేయడంతో కచ్చితంగా 1 మిలియన్ టచ్ చేస్తుందనుకున్నారు. అయితే ఆరంభసూరత్వం లాగా 1మిలియన్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. ఇలా వరసగా నాని సినిమాలు ఓవర్సీస్ లో ప్లాప్ అవ్వడం తనని కొంచెం ఇబ్బందిపెట్టే పరిణామమే సుమా.