అంతా ఫేక్ ! నాని కొత్త సినిమా !!!


అంతా ఫేక్ ! నాని కొత్త సినిమా !!!
అంతా ఫేక్ ! నాని కొత్త సినిమా !!!

సోషల్ మీడియాలో రూమర్స్ రావడం చూస్తుంటే ఏది నిజమో ఏది అబద్దమో నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇక కొంతమంది సొంత టాలెంట్ తో స్పెషల్ పోస్టర్ ని తాయారు చేసి వదులుతుండడం చూస్తుంటే.. కొన్నిసార్లు నిజమని నమ్మక తప్పట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెలుతున్న నాని ఇటీవల మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది.

అయితే అందులో ఎలాంటి నిజం లేదని దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ నెక్స్ట్ సినిమా నానితో చేయబోతున్నట్లు ఇటీవల ఒక పోస్టర్ వైరల్ వయ్యింది. అందులో సమంత హీరోయిన్ గా నటిస్తున్నట్లు పేరు కుండా ఉండడంతో అంతా నిజమనుకున్నారు. కానీ కొద్దిసేపటికే దర్శకుడు ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని పోస్టర్ కూడా ఫెక్ అని కొట్టిపారేశాడు.

అలాగే వీలైనంత త్వరగా తన తదుపరి సినిమాకు సంబందించిన అప్డేట్ ఇవ్వనున్నట్లు శివ నిర్వాణ సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. గత కొంత కాలంగా శివ నిర్వాణ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ పై మాత్రం దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు నెక్స్ట్ విజయ్ తోనే శివ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ డైరెక్షన్ ‘వరల్డ్ ఫెమస్ లవర్’ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

Credit: Twitter