నాని కొత్త సినిమా “టక్ జగదీష్”


Nani New movie Tak Jagadhish
Nani New movie Tak Jagadhish

ఈ ఏడాది గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా పెన్సిల్ పార్ధ సారధి క్యారెక్టర్ తో మనల్ని అలరించిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తనకు మొదటి సినిమా చాన్స్ ఇచ్చిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తో “V” అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు నాని తను చాన్స్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణతో మరొక సినిమా అనౌన్స్ చేసాడు. ఆ సినిమా పేరు “టక్ జగదీష్”. ఈరోజు ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసారు.

Shine screens బ్యానర్ పై సాహు గారపాటి & హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివ నిర్వాణ గత సినిమా మజిలీ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోస్ చేసిన తమన్ “టక్ జగదీష్” సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ళ ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. పెళ్లి చూపులు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన రితూ వర్మ, కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో కథానాయికలు. దర్శకుడు శివ నిర్వాణ తన గత సినిమాలలో కూడా హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమాకు ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి ఆర్ట్ : సాహి సురేష్

ఇక ఈ సినిమాకు సంబంధించి, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకర్షిస్తోంది. టక్ చేసుకున్న షర్ట్ ని సరి చేసుకుంటున్నట్లు ఉన్న నాని పోస్టర్ ని మొదట విడుదల చేసారు. శివ నిర్వాణ తన గత రెండు సినిమాలలో హీరోలను కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో చూపించాడు. ఇక నటన పరంగా అన్ని రకాల ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించే నాని పెర్ఫామెన్స్ ఈ సినిమా లో నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఆశించవచ్చు.