నాని కి మరో ప్లాప్ తప్పదా ?


హీరో నాని తాజాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో అప్పటి నుండి ఈ దర్శకుడితో సినిమాలు చేయడానికి హీరోలందరూ భయపడుతున్నారు . ఎంతమంది హీరోలను కలిసినా శ్రీకాంత్ కు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అయితే నాని మాత్రం ధైర్యం చేసి ఛాన్స్ ఇస్తున్నాడు .

దాంతో నానికి మరో ప్లాప్ తప్పదని అంటున్నారు . ఇప్పటికే జెర్సీ చిత్రంతో కొంత ఇబ్బంది పడ్డాడు నాని . జెర్సీ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ , విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు దాంతో నాని మార్కెట్ కి కొద్దిగా దెబ్బ పడింది . ఇక ఇప్పుడేమో ప్లాప్ డైరెక్టర్ తో సినిమా అంటే మరో ప్లాప్ తప్పదేమో ! అనిపిస్తోంది . నాని ధైర్యం చేసి ఛాన్స్ ఇస్తున్నందుకు హిట్ అయితే మంచిదే లేకపోతేనే ఇబ్బంది పాపం .