మైత్రీతో నాని మ‌రో సినిమా ఫిక్స్‌!


Nani one more film for mythri movie makers
Nani one more film for mythri movie makers

ప‌వర్‌స్టార్ మాత్ర‌మే స్పీడు పెంచార‌నుకుంటే మిగ‌తా హీరోలు కూడా అదే బాట‌లో వ‌రుస ప్రాజెక్ట్‌ల‌ని ప్ర‌క‌టించేస్తున్నారు. నేచుర‌ల్ స్టార్ నాని ఆ వ‌రుస‌లో ముందున్నారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ దర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి`లో న‌టిస్తున్న నాని ఈ సినిమా రిలీజ్‌కి ముందే మ‌రో చిత్రాన్ని ప్రారంభించేశాడు.

`ట‌క్ జ‌గ‌దీష్‌` పేరుతో రూపొందుతున్నఈ చిత్రాన్ని శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ సినిమాస్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీటితో పాటు `శ్యామ్ సింగ్ రాయ్‌`ని కూడా ఇటీవ‌లే ప్ర‌క‌టించ‌న నాని మ‌రో చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. మైత్రీ మూవీమేక‌ర్స్‌లో `గ్యాంగ్ లీడ‌ర్` చిత్రాన్ని చేసిన నాని మ‌ళ్లీ అదే సంస్థ‌కు మ‌రో చిత్రాన్నిచేయ‌బోతున్నార‌ట‌.

ఇటీవ‌ల కిడ్నాప్ డ్రామాకు ఫ‌న్‌ని జోడించి స‌రికొత్త‌గా  `బ్రోచే వారెవ‌రురా`గా అందించి ఆక‌ట్టుకున్న వివేక్ ఆత్రేయ ఇటీవ‌లే ఓ సూప‌ర్ లైన్‌ని నానికి వినిపించాడ‌ట‌. నానికి లైన్ న‌చ్చ‌డంతో అత‌నితో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. నాని అంగీక‌రించిన మూడు చిత్రాలు పూర్త‌యిన త‌రువాతే వివేక్ ఆత్రేయ సినిమా సెట్స్‌పైకి రానుంద‌ట‌.