మైత్రి వారి ఆశలన్నీ నానిపైనే


Nani
మైత్రి వారి ఆశలన్నీ నానిపైనే

మైత్రి మూవీ మేకర్స్.. టాలీవుడ్ లో ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించిన నిర్మాణ సంస్థ. దీన్నుండి వచ్చిన తొలి మూడు చిత్రాలు దేనికదే బ్లాక్ బస్టర్లు. శ్రీమంతుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం సినిమాలతో ఒక దానిని మించి మరొక హిట్ అందుకుంది. అయితే గతేడాది సెకండ్ హాఫ్ నుండి ఈ సంస్థకు ఏదీ పెద్దగా కలిసిరావట్లేదు.

చేసిన సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోనీ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి హిట్ అనిపించుకున్నా కానీ వచ్చిన లాభాలు మాత్రం తక్కువే. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ మళ్లీ లాభాల బాట పట్టాలంటే ఈ వారం విడుదల కానున్న గ్యాంగ్ లీడర్ కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. ఈ చిత్రంపై మైత్రి ఏకంగా 30 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టింది. కేవలం నాని ఫ్యాక్టర్ పైనే ఈ సినిమా బిజినెస్ కూడా జరిగింది. మరి నాని మైత్రి సంస్థను ముంచుతాడో, తేల్చుతాడో తెలియాలంటే ఈ నెల 13 వరకూ వెయిట్ చేయాల్సిందే.